సంచలన మూవీ కెజిఎఫ్ 2 ప్రకటన..

దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏంటా ఆ మూవీ అనుకుంటున్నారా..రాఖీ భాయ్ యాష్ నటిస్తున్న కెజిఎఫ్ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. గత నాల్గు రోజులుగా వరుస పెట్టి చిన్న, పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఉండగా.. కెజిఎఫ్ 2 రిలీజ్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అనుకుంటున్నా సమయంలో మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ ప్యాన్ ఇండియా మూవీని జూలై 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో.