సీఎంగా కేటీఆర్ ను ప్రకటిస్తే జరిగే సంచలనాలు..

ప్రస్తుతం తెలంగాణలో త్వరలో సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుండడం, అదే విధంగా కాంగ్రెస్ పీసీసీ మార్పు ఉండనుండడంతో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుండడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడతారని పలువురు భావిస్తున్నారు. ఇది వరకే కొన్ని ఎన్నికలకు కేటీఆర్ అధ్యక్షత వహించడం, ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రజలలో కేటీఆర్ కు మంచి పేరు ఉందని కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

ఒకవేళ కేటీఆర్ ను సీఎం గా ప్రకటిస్తే హరీష్ రావు ఎలా స్పందిస్తాడనేది ప్రస్తుతం చాలా ఆసక్తికర అంశం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీలో ఉన్న అసంతృప్తుల నిర్ణయం కీలకం కానుంది. తమకు తగినంత ప్రాధాన్యత లేదని భావిస్తున్న సదరు నేతలు కేటీఆర్ సీఎం నిర్ణయాన్ని అదునుగా చేసుకొని పార్టీ నుండి జంప్ అయ్యే అవకాశాలు ఉండనున్నాయి. దాంతో వారు వెళ్లడమే కాదు టీఆర్ఎస్ పార్టీలో విబేధాలున్నాయని ప్రజలు భావించే అవకాశముంది.

ఒక వైపు అసంతృప్త జ్వాలలు, ఇటు హరీష్ రావు నిర్ణయం ఇటువంటి సంచలన సంఘటనల నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను కేసీఆర్, కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది. మరొకవైపు అసంతృప్తి వర్గం, హరీష్ రావు ఆ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తే ఎటువంటి ఘటనలకు తావు ఉండకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *