శ్రీకాళహస్తిలో విచ్చల విడి కబ్జాలు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విచ్చల విడిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అండతో వైసీపీ పార్టీ అనుచరులు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ భూములు, ఆర్.అండ్.బి రోడ్డు , కాలువ పరుంబోకు స్థలాలు, పేదల భూములు కబ్జాలు చేస్తున్నారని స్థానిక ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తేవడంతో, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ లో పర్యటించి, కబ్జాలు జరిగిన స్థలాలను పరిశీలించారు. శ్రీకాళహస్తి నుండి పిచ్చాటూరు కి వెళ్ళే రోడ్డు పైన రాజీవ్ నగర్ కాలనీ నందు ఆర్.అండ్.బి రోడ్డు, కాలువ పరుంబోకు స్థలాలు ఎమ్మెల్యే అండతో పట్టపగలే కబ్జాలు చేసి కాంప్లెక్సులు కట్టి లక్షలకు అమ్మేస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలు వినుత దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వినుత గారు మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో కబ్జాలకు గురైన ప్రతి సెంటు స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. విచ్చల విడి కబ్జాలు చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టు బోను ఎక్కిస్తామని తెలిపారు. కబ్జా స్థలాలను కొనుగోలు చేసి నష్ట పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్రశేఖర్, నాయకులు రవి కుమార్ రెడ్డి, రాజ్య లక్ష్మి, పేట చిరంజీవి, నక్కా ప్రసాద్, శారద, గురవయ్య, ఉదయ్, హేమంత్ గౌడ్, దినేష్, జనసైనికులు బబ్లూ తదితరులు పాల్గొన్నారు.