జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

పోడూరు, భారతరత్న డా.బి.అర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మండలంలోని గుమ్మలురు గ్రామములో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు డ్రాయింగ్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి రావి హరీష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందని చెప్పారు ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెలెందుకు పిల్లలు అందరు మంచిగా చదువు కోవాలని తద్వారా జ్ఞానంపార్చన చేయాలనీ చెప్పారు అప్పుడే మనమందరం అంబేద్కర్ ఆలోచనకి అనుగుణంగా నడుచుకున్నావలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడాల రాజేష్, గ్రామ అధ్యక్షులు కడలి రాంబాబు, వార్డ్ మెంబర్ దార్లంక శ్రీలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు.