ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయండి

నెల్లూరుకి విచ్చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణిని కలెక్టరేట్ లో జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 16 గిరిజన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం ప్రజలకు అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాసేవను మెరుగుపరచడానికి ప్రతి మండల హెడ్‌క్వార్టర్స్‌లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆధార్ సేవలు, ఇతర సంక్షేమ పథకాలు అందుబాటులోకి రాలేదని అన్నారు. సర్వేపల్లి ఫ్యాక్టరీ పరిసరాల్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేకంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యాలయం ఇన్చార్జి జమీర్, పోలయ్య, జిల్లాసంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గుర్రం కిషోర్, సుధా మాధవ్, రుషి యాదవ్, వెంకీ, శరవణ, వెంకట్ యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, సురేష్, శ్రీకాంత్, హరి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment