పొట్టి శ్రీరాములుకు అవమానం..!

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి గౌరవం తెలిపే ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా, బీచ్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని పేర్కొన్నారు. అయితే, అనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారులు, ప్రభుత్వం గౌరవించకపోవడం చాలా విచారకరమని అన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములును ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన విగ్రహానికి లేదా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం ప్రజా ప్రతినిధుల మరియు అధికారుల బాధ్యత అని చెప్పారు. విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని శుభ్రపరచడం, పూలమాలలు వేసి నివాళి అర్పించడం వంటి పనులు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదని, కనీసం మేయర్ లేదా ఇతర అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొప్ప వ్యక్తిని మర్చిపోవడం చాలా విచారకరమని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాబోయే కాలంలో అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, వెంకట్, టమాట అప్పారావు, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment