దళిత బిడ్డలను చంపి దళిత బంధు ఇస్తామనడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం లేదా..!: వంగ లక్ష్మణ్ గౌడ్

  • చిన్నారి నిఖిత హత్య జరిగి 26 రోజులు అవుతుణ్ణా కుడా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ అధికారులు.
  • చిన్నారి నిఖిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎటువంటి పోరాటనికైనా సిద్ధం

నాగర్ కర్నూల్, గత నెల మార్చ్ 6 వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం, మన్ననురు గురుకుల పాఠశాలలో చదువుతున్న చిన్నారి నిఖితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా గత నెల 25 వ తేదీన నాగర్ కర్నూల్ టౌన్ లో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష నిరసన ర్యాలీకి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ మద్దతు తెలిపి చిన్నారి నిఖితకు న్యాయం చేయాలని గళం వినిపించారు. నిఖిత హత్య జరిగి 26 రోజులు అవుతున్నా నిర్లక్షం వహిస్తున్న ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఆదివారం నాగర్ కర్నూల్ టౌన్ సమీపంలో ఎమ్మర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రెస్ మీట్ కు మద్దతు తెలిపిన వంగ లక్ష్మణ్ గౌడ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక దళిత ఎమ్మెల్యే, దళిత ఎం.పి, దళిత జెడ్పీ చైర్మన్, దళిత కలెక్టర్. ఇవన్నీ పేరుకే, చెప్పుకోవడానికే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు మా ఇంట్లో బిడ్డను చంపి, ఈ హత్య వెనుక ఉన్న వాళ్లందరినీ శిక్షిస్తామని చెప్పాల్సింది పోయి, దళిత బంధు ఇస్తాం, ఇక మర్చిపోండి అంటే, సిగ్గు ఉందా అచ్చంపేట ఎమ్మేల్యేకి.! దళిత బంధు ఉన్నది పసి పిల్లలను పొట్టనపెట్టుకొని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వటానికా..? దీని కోసమా దళిత బంధు…? ఇవేనా సంక్షేమ పథకాలా..? అని ధ్వజమెత్తారు. చిన్నారి నిఖిత హత్యపై విచారణ జరిపి, దుండగులను శిక్షించేంతవరకు మంద కృష్ణ మాదిగ అన్న అడుగులో అడుగై నిఖితకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికైనా సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గోపాస్ కుర్మన్న, సూర్య, ఆంజనేయులు, బోనాసి లక్ష్మణ్, లింగం నాయక్, పూస సంతోష్ మరియు జనసైనికులు, నాగర్ కర్నూల్ జిల్లా అఖిల పక్ష పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.