శంకర్ ‘జెంటిల్ మేన్’ సీక్వెల్

అర్జున్-శంకర్ కాంబినేషన్లో 1993లో తమిళంలో వచ్చిన జెంటిల్ మేన్ చిత్రం ఒక సంచలనం. తమిళనాట సూపర్ హిట్ కాగా, తెలుగులోకి అదే పేరుతో అనువాదం చేయగా, ఇక్కడా పెద్ద హిట్ అయింది. ప్రముఖ నటుడు అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లు కాగా, ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమై తోలి సినిమాతోనే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి స్టార్ దర్శకుడుగా మారాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన నిర్మాత కె.టి.కుంజుమోన్. ఈ చిత్రం వచ్చి 27 సంవత్సరాలు కాగా తాజాగా ఇప్పుడు దానికి సీక్వెల్ చేస్తున్నట్టుగా నిర్మాత కుంజుమోన్ ప్రకటించారు. ‘జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

పాన్ ఇండియా ఫిలింగా దీనిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది  అన్నది ఇంకా వెల్లడికాలేదు. అలాగే, హీరో హీరోయిన్ల వివరాలు కూడా తెలియాల్సివుంది.