పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన జనసేన తెలంగాణ ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ సంఘటన తీవ్రతను గ్రహించి చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మృతుల ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం కంపెనీ యాజమాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన అంశాన్ని స్వాగతించామని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ యడమ రాజేష్ జిల్లా కలెక్టర్, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్‌లతో కలిసి పరిశ్రమపై రెగ్యులర్ పర్యవేక్షణ చేపడేందుకు, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనాలు జరగకుండా చర్యలు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు డప్పు అరవింద్, వేణు, అఖిల్, శ్రీనివాస్, సాకేత్, ప్రవీణ్ సాహు, హరి నాయక్, శేరిలింగంపల్లి ఇంచార్జీ మాధవ రెడ్డి పాల్గొన్నారు.

Share this content:
Post Comment