రియల్ స్టార్ శ్రీహరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ గౌడ్

తెలంగాణ, కూకట్ పల్లి: సినీ నటుడు రియల్ స్టార్ శ్రీహరి 10వ వర్ధంతి సందర్భంగా బాలనగర్ లోని శోభనా కాలనీలో శ్రీహరి కుటుంబం సభ్యులు ఏర్పాటు చేసిన 10 వర్ధంతి కార్యక్రమమునకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ విచ్చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీహరి సినీ నటుడే కాకుండా ఎంతో మంది పేద ప్రజలకు మరియు సినీ రంగంలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు సహాయం చేసేవారని ఎవరికైనా ఆపదలో ఉంటే ముందుగా శ్రీహరి గారే గుర్తొచ్చేవారని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీహరి గారికి మంచి సత్ సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, ఎస్ కె నాగూర్, భరత్ గౌడ్, రాము, కొల్లా శంకర్, నాగేంద్ర, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.