తాండూరు ప్రచారంలో దూసుకుపోతున్న శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు నియోజకవర్గంలో బిజేపి బలపరచిన జనసేన తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జనసేన, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బషీరాబాద్ మండల్ లోని మార్కెట్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.