వరద ప్రాంతాల్లో శంకర్ గౌడ్ పర్యటన

కూకట్ పల్లి నియోజకవర్గం: గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో వర్షాల నేపథ్యంలో నాళాలు పొంగిపొర్లి ఆ నీరు లోతట్టు ప్రాంత ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో నాగార్జున కాలనీ ప్రాంతంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ వరద ప్రాంతాలను సందర్శించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కాలనీవాసులకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ నాగేంద్ర(అడ్వకేట్), వెంకటేశ్వరరావు, మహేష్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు ఎస్.కె నాగూర్, జనరల్ సెక్రెటరీ భరత్ గౌడ్, వీరు, రాము, బాలాజీ, సాయి, కేశవ్, గణేష్, వెంకటలక్ష్మి గారు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.