పరిక్ష సామాగ్రి పంపిణీ చేసిన కండక్టర్ శంకర్ నాయుడు

అర్ధవీడు: రాచర్ల మండలానికి చెందిన సామాజిక కార్యకర్త కండక్టర్ శంకర్ నాయుడు ఆధ్వర్యంలో.. జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య ముఖ్య అధితిగా విచ్చేసి 10వ విధ్యార్దినులకు పరిక్ష సామాగ్రి పంపిణీ చేసి.. అనంతరం విధ్యార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాలికల సాధికారతకు విధ్య అనేది ముఖ్య ఆయుధం అని, అదే విధంగా పరిక్ష సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనే మార్గ దర్శకలాను ఉన్నత విధ్య కెరియర్ గైడ్ లైన్స్ తెలియజేస్తూ పాఠశాలలో ఆధిక మార్కులు సాదించిన విధ్యార్దినికి ఉన్నత చదువుకు 5000/- రూపాయలు ప్రోత్సాహక నగదు ప్రకటించడమైనది..శంకర్ నాయుడు మాట్లాడుతూ.. మనకి చదువు నేర్పించిన గురువులను మర్చిపోవద్దని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో విధ్యార్దినులు, ఉపాధ్యాయుల బృందం మరియు రాచర్ల మండల యువనాయకులు రిషి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉపాధ్యాయునులు కండక్టర్ శంకర్ నాయుడు కు కృతఘ్నతలు తెలిపారు.