కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పిన షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్‌ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఈమేరకు షర్మిల తన ట్విట్టర్‌ ఖా తాలో ట్వీట్‌చేశారు. ‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామని షర్మిల అన్నారు.