పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా శర్వానంద్!

తెలుగులో కథలను ఎంచుకునే విషయంలో నాని తరువాత స్థానంలో శర్వానంద్ కనిపిస్తాడు. అందువలన ఆయనకి యూత్ లోనే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. అలాంటి శర్వానంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇంతకుముందు శర్వానంద్ .. ‘రాధ’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశాడు. కానీ అది కామెడీ టచ్ తో కూడిన పాత్ర. కానీ ఈ సారి మాత్రం ఆయన కరుకైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో … అంటే, ‘అంకుశం’లో రాజశేఖర్ రేంజ్ లో రెచ్చిపోనున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ‘మహాసముద్రం’ .. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఆయన అంగీకరించిన కొత్త కథలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెబుతున్నారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు వెరైటీగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శక నిర్మాతలు ఎవరనేది త్వరలో తెలియనుంది.

ఇటీవల కాలంలో శర్వానంద్ కి వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. ‘మహానుభావుడు’ తరువాత శర్వానంద్ కి ఇంతవరకూ హిట్ పడలేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలైనా ఆయనకి సక్సెస్ ను ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.