రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా షేక్ ఖాదర్ బాషా

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా ఎన్నికైన షేక్ ఖాదర్ బాషా మరియు పలువురు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాద్యతలు చేపట్టిన సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అవసరం మేరకు కావలసిన సహకారం కూడా అందుతుందని చుట్టుపక్కల సుదూరప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చేది కేవలం బడుగు బలహీన సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు ఎక్కువగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో వస్తుంటారని భాదితులు పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రిలోని వైద్యాధికారులు మరియు సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం నుంచి వెలువడే నిధులను ఏ మాత్రం వృధా కాకుండా అనోవసరంగా దుర్వినియోగం చెయ్యకుండా అన్ని రకాల సదుపాయాలతో వైద్య పరీక్షలకు కావాల్సిన పరికరాలకు సంబంధించి నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అనారోగ్యులకు భరోసాగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆసుపత్రిని అన్ని విధాలుగా సుందరంగా అభివృద్ధి వైపు దిశగా ముందుకు తీసుకెళ్ళాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు కూటమి శ్రేణులు బులెట్ విజయ్, వెంకటేష్, శ్రీకాంత్, మస్తాన్, అఫ్తాద్, జిలాన్, తాహిర్, అమీర్, అలీ, పీర్, మహ్మద్, ఇమ్రాన్, సాయి, మహేష్, రవి, సురేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment