షేక్ రియాజ్ జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదినం సందర్భంగా ఆదివారం శ్రీ శ్రీ శ్రీ శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి వారి సన్నిధానంలో అధ్యక్షులు షేక్ రియాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. రంగనాయక స్వామి వారి సన్నిధానంలో మజ్జిగ వితరణ చేసి.. కేక్ కట్ చేయడం జరిగింది. ఈ జన్మదిన కార్యక్రమంలో రాచర్ల మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, కొమరోలు మండల అధ్యక్షుడు ఓబులేష్ నాయుడు, బ్రహ్మనాయుడు, జనసేన పార్టీ కార్యకర్తలు పార్లపల్లి శ్రీనివాసులు, బత్తిని కృష్ణయ్య, రాస శ్రీనివాసులు, భూమా ఓబులేసు, భూమా బాల ఓబయ్య, రామాంజనేయులు, రాముడు, షేక్ చిన్న ఖాసిం వలి, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.