మండల అధ్యక్షులను అభినందించిన షేక్ రియాజ్

  • పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం చేసిన షేక్ రియాజ్

కొండపి నియోజకవర్గం: నియోజకవర్గంలోని 6 మండలాల అధ్యక్షులు కలిసి ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కొండపి నియోజకవర్గంలో ప్రజా సమస్యల కోసం ప్రతినిత్యం మండల అధ్యక్షులు పోరాటం చేసి, ప్రజా సమస్యలు పరిష్కరించి, ప్రజలకు దగ్గరగా ఆత్మీయంగా ప్రేమతో మెలగడం చాలా సంతోషకరమైన విషయం, జనసేన పార్టీని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు, అదేవిధంగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన కిట్లు కూడా మండల అధ్యక్షులకి ఆదివారం ఇవ్వడం జరిగింది, కొండపి నియోజకవర్గం ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది, ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ఆరు మండలాల అధ్యక్షులుకి నా శుభాకాంక్షలు అంటూ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అభినందనలు తెలియజేశారు. పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, టంగుటూరు మండలం అధ్యక్షులు కందుకూరి రాంబాబు, కొండపి మండలం అధ్యక్షులు నాగా విశ్వబ్రహ్మం, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడ శశిభూషణ్, మర్రిపూడి మండలం అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ మొదలైన ఆరు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.