గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ‘శేఖర్ మాస్టర్’

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  స్టార్ యాంకర్..నటుడు  ప్ర‌దీప్ మాచిరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించిన శేఖ‌ర్ మాస్ట‌ర్ జూబ్లీ హిల్స్  పార్క్‌లో మొక్క నాటారు. ఇంత మంచి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి శేఖ‌ర్ మాస్ట‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంత‌రం కొరియోగ్రాఫ‌ర్స్ బాబా భాస్క‌ర్‌, స‌త్య మాస్ట‌ర్‌, రఘుమాస్ట‌ర్‌ను ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్ సూచించారు.