సురేంద్రబాబుకి ఘన స్వాగతం పలికిన శెట్టూరు మండల జనసేన

శెట్టూరు మండల కేంద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శెట్టూరు మండలం పర్యటనలో భాగంగా శెట్టూరు మండల కేంద్రానికి విచ్చేసిన సురేంద్రబాబుకి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో “శెట్టూరు మండలం జనసేన పార్టీ” తరఫున ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా శెట్టూరు మండల కేంద్రంలో జనసేన-టిడిపి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో జనసేన పార్టీ తరపున మండల అధ్యక్షులు కాంత్ రాజు, మండల ఉపాధ్యక్షులు రామలింగ అధ్యక్షత వహించగా, మండల ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, ప్రధాన కార్యదర్శులు షేక్ రజాక్, గురుస్వామి, లక్ష్మణ్, కార్యదర్శులు వెంకటేశులు, మండల ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.