గిరిజన తండాలో మెరిసిన ఆణి ముత్యం.. సోబోయి హేమంత్

*జాతీయ స్థాయిలో ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో సత్తా చాటిన గిరిజన ముద్దు బిడ్డ సోబోయి హేమంత్

*సోబోయి హేమంత్ కు జనసేన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ప్రత్యేక అభినందనలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, డుంబ్రిగుడా మండలంలో అదొక చిన్న గ్రామం. గిరిజన తండా అరకుకు చెందిన సోబోయి హేమంత్ ఆడుతూ పాడుతూ తోటి స్నేహితులతో కలిసి గ్రామంలొనే చదువుకుంటున్నాడు. తండ్రి వ్యవసాయ కూలి. జనసేన పార్టీ లో డుంబ్రిగుడా మండలంలో కీలక నాయకుడు సోబోయి రాజు సొంత ఊరు అరకు. సంత బయలు గిరిజన ప్రాంతంలో ఎవరికి సాధ్యం కాని ఘనత సాధించాడు. చదుల రారాజు…మన్యం ముద్దు బిడ్డ జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచాడు. (ఎన్ఎంఎంఎస్) పరీక్షల్లో ఎవరికి సాధ్యం కానిది గిరిజన తండాలో పుట్టి పెరిగిన మట్టిలో మాణిక్యం చదువుల తల్లి సరస్వతి దేవి గర్వపడేలా జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మైన మేము దేనిలో తక్కువ కాదు అనేలా జాతీయ స్థాయిలో గిరిజనులు గర్వించేలా గొప్ప ఘనత సాధించిన సోబోయి హేమంత్ కు జనసేన పార్టీ తరుపున అభినందనలు తెలిపారు. మన్యం లో ఏ మండలానికి సాధ్యం కాని ఘనత డుంబ్రిగుడా మండలం అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి హేమంత్ కి జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ.. ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.