అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న శివదత్ బోడపాటి

పాయకరావుపేట, మాసాహెబ్ పేట గ్రామంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ.. ఈనాడు మన దేశం ఆర్థికంగా, సామాజికంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారణం శ్రీ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పటిష్టమైన రాజ్యాంగమే. ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన శ్రీ అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టం అని తెలియజేసి.. ఇంత చక్కటి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.