జి.యర్రంపాలెం గ్రామంలో వైసీపీకి షాక్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, జి. యర్రంపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపికి చెందిన ముఖ్య నాయకులు కోనే వెంకటేశ్వర్లు, కోనే దుర్గారావు, కోనే రాంబాబు, కుసే శివ అవినీతి, అరాచక వైఎస్ఆర్సిపి పాలనపట్ల విసుగు చెంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు. వారందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.