చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి శిక్ష ఉండదా?.. చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్ నియోజక వర్గం: పోలీస్ పహారా లో రైతు కన్నీరు పెడుతున్నాడు. చట్టాన్ని, న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి ఏటువంటి శిక్ష వెయ్యరా? అని తెలంగాణ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గౌరవ నీటి పారుదల శాఖ మంత్రికి, మా నియోజక వర్గ ఎమ్మెల్యే గారికి, మా నియోజక వర్గ బాధ్యులు ఇన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రజలకు ఉన్న కొన్ని సదేహాలు తీర్చగలరా?. ప్రజల వద్దకు వచ్చి సమాధానం చెప్పాలని మనవి. ఎందుకంటే కొన్ని రోజుల్లో మన రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. అంతకన్నా ముందు మా సందేహాలు తిర్చితే ప్రజలమైన (ఓటరు) మేము నిర్ణయిస్తాం నిజాయితీ పరులైన నాయకుల లేక అవినీతి చేసే నాయకులా అని!. కోర్టు ఆర్డర్, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును బెకాతరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. రైతుకు పూర్తిగా పరిహారం చెల్లించకుండా కుటుంబాలను పోలీస్ పహారా మధ్య రోడ్డు మీదకు తీసుకువచ్చిన తెలంగాణ ను పరిపాలిస్తున్న బి.ఆర్.ఎస్ నాయకులు. అక్కడ వున్న ఆడపడుచులకు గుర్తింపు లేకుండా చేసి పరిహారం ఇవ్వలేదు 117 మహిళలకు.. అలాగే 2010 ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెజిట్ వరకు 937 కుటుంబాలు కానీ, ప్రాజెక్టు రీడిజన్ వల్ల 2010 నుండి 2022 డిసెంబర్ 31 వరకు 500 పేజీలకు మేజర్లైన అబ్బాయిలు, అమ్మాయిలు అందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక్కరికీ కూడా హమిఫలం అందకముందే ఊరిలో వున్న ప్రతి ఇంటిని పోలీస్ వ్యవస్థను ముందు వుంచుకొని రైతును, రైతు బిడ్డలను అవమానించారు. కొత్తగా వచ్చిన 49 ఏకరాల రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గెంటేశారు. చట్టం సామాన్య మానవులకు బాగా బలంగా (కష్టపెట్టడం) పని చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంను నడుపుతున్న బి.ఆర్.ఎస్ పార్టీకి, పార్టీ నాయకులకు కోర్టు ఆర్డర్ ను దిక్కరిస్తున్నారు అని ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్ట్ లతో నొక్కేస్తూ ఉన్నారు. ఊరు కాళీ చేయించారు, పోలీస్ పహారా లో రైతు కన్నీరు పెడుతున్నాడు. చట్టంను, న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి ఏటువంటి శిక్ష వెయ్యరా?.. అడిగితే అరెస్టులు, మీడియా మిత్రులు కూడా భయంతో నిజం కూడా రాయడం లేదు. ప్రశ్నించే గొంతు నిజాయితీగా నిలబడే రైతు ఏడుపు దేనికి దారి తీస్తుందో ముందు చూడాలి. ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వాన్ని నడిపే నాయకులు ఒక్కసారి అత్మపరిశీలన చేసుకొని రైతును కాపాడండి అని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.