నర్రా వారి పాలెం గ్రామానికి రోడ్డు మార్గం చూపండి

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, నర్రా వారి పాలెం గ్రామానికి రహదారి కోసం గత కొద్ది రోజులుగా గ్రామ ప్రజలు, జనసేన నాయకులు పోరాటంలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కి మరియు ఆర్డిఓ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. అయితే ఈ నర్రా వారి పాలెంకు వెళ్ళే రహదారిని పరిశీలించడానికి బుధవారం నాడు జాయింట్ కలెక్టర్ రావడం జరిగినది. జాయింట్ కలెక్టర్ కి గ్రామ ప్రజలు, జనసేన నాయకులు రైల్వే నూతన 3వ లైన్ నిర్మాణంలో నర్రా వారి గ్రామానికి వెళ్ళే రహదారి పోవడంపై వారి ఆవేదన వ్యక్తంచేశారు. అయితే మాకు రోడ్డు మార్గం చూపాలని జాయింట్ కలెక్టర్ కి గ్రామ ప్రజలు, జనసేన నాయకులు విన్నవించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు శశి భూషణ్, సంకే నాగరాజు, కాసుల శ్రీనివాస్, అనుమలశెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, నున్న సతీష్, జనసైనికులు, మరియు నర్రా వారి పాలెం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.