జనసేన నాయకులు దుర్గా శ్రీనివాస్ కు శ్రద్ధాంజలి

కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలాజీ నగర్ 115 డివిజన్ జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు దుర్గా శ్రీనివాస్ (హైటెక్ శ్రీను) అకాల మరణానికి చింతిస్తూ 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు టెంపుల్ బస్టాండ్ లో దుర్గా శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు శంకర్ గౌడ్, రాదారం రాజలింగం, మండలి దయాకర్, కొల్లా శంకర్, నందగిరి సతీష్, మహేష్, బచ్చు నాగ మల్లేశ్వరరావు, వెంకట సుభాష్, వెంకటాచారి, పసుపులేటి ప్రసాద్, సలాది శంకర్, వినోద్ కుమార్, వీర మహిళలు ద్రాక్షాయిని, వెంకట లక్ష్మి, మహాలక్ష్మి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీ నాయకులు మరియు కాపు సంఘ అధ్యక్షులు భరత్ కుమార్, హెచ్ఎం మూర్తి, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, రాంబాబు, సత్యనారాయణ, వాసునాయుడు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.