శ్రీ మంగెన గంగయ్య స్మారక ఉచిత మెగా వైద్య శిబిరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజవర్గం మలికిపురం మండలం, లక్కవరం ఎం.జి గార్డెన్స్ లో జి.యస్.ఎల్ హాస్పిటల్స్ రాజానగరం వారి సౌజన్యంతో బుధవారం మంగెన వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 విభాగాల డాక్టర్లతో శ్రీ మంగెన గంగయ్య స్మారక ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొనడం జరిగింది. ముందుగా మంగెన గంగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉచిత మెగా శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ జనసేన నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్, రాజోలు తెలుగుదేశం నాయకులు గొల్లపల్లి సూర్యరావు, రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, రాపాక రమేష్ బాబు, ఎంపిపి, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం లక్కవరంలో జిఎస్ఎల్ హాస్పిటల్స్ రాజానగరం వారి సౌజన్యంతో మంగెన వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మంగెన గంగయ్య స్మారక ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.