క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షలు చెక్కు అందచేసిన శ్రీ నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, సీహెచ్ గున్నేపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు శ్రీ గనిశెట్టి వెంకటేశ్వరరావు ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీ వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లి శ్రీమతి జయలక్ష్మి, భార్య శ్రీమతి కొండవేణి, ముగ్గురు కుమార్తెలకు ధైర్యం చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును శ్రీమతి కొండవేణికి అందచేశారు. శ్రీ వెంకటేశ్వర్లు చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆ కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.