ఆకట్టుకుంటున్న శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్

నాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు అభిమానులకి గిఫ్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తన అభిమానులకి శ్యామ్ సింగరాయ్ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ చెప్పినట్లు చెప్పిన సమయానికి విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను నాని తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. పేరు శ్యామ్ పూర్తి పేరు శ్యామ్ సింగరాయ్ అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నాని జేబుల్లో చేతులు పెట్టుకొని నించొని ఉంటే వెనుక నుంచి హీరోయిన్ కౌగిలించుకొని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తుంది. ఈ చిత్రాన్ని కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్వకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.