ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు నామినేషన్ దాఖలుకి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు. శ్రీ నాగబాబు గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీమతి లోకం నాగ మాధవి, శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ అరవ శ్రీధర్ , శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ పంతం నానాజీ సంతకాలు చేశారు.
Share this content:
Post Comment