ఘనంగా డా. ఉగ్ర నరసింహ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

కనిగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు గురువారం కనిగిరి మండలం, బల్లిపల్లి పంచాయతీలో బాల వెంకటాపురం గ్రామం కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడం జరిగినది. ఈ వేడుకలలో జనసేన పార్టీ తరఫున కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, మాదాల కొండలరావు, సొంగ అమరేంద్ర, కే బాబు, కుంచె చరణ్, చెన్నకేశవులు, గూడూరు రవి, బోయల గురుస్వామి, రెడ్డి కనకయ్య, జనసైనికులు మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగినది.