సింగనమల, ఈనెల 14వ తేదీన పిఠాపురం వేదికగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సింగనమల మండల అధ్యక్షులు జనసేన తోట ఓబులేసు పిలుపునిచ్చారు. తోట ఓబులేసు మాట్లాడుతూ మన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. హాజరు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆహుడా చైర్మన్ టి వరుణ్ వాహన సదుపాయం కల్పిస్తామన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తోట ఓబులేసు తెలుయజేశారు. జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయే సభగా మారుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment