జనసేనానికి వినతిపత్రమిచ్చిన శింగనమల జనసేన

తిరుపతి జిఆర్ఆర్ కాన్వెన్స్ హల్ లో జరిగిన జనవాణి-జనసేన కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం లో శింగనమల హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిఆర్ఆర్ కాన్వెన్స్ హాల్ లో జనవాణి కార్యక్రమంలో సిద్దు మన్నల పెద్దిరాజు కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఎస్సి రిజ్వేషన్ కలిగిన సింగనమల నియోజకవర్గం 1967 సంవత్సరం లో ఏర్పడింది. దాదాపుగా 50 సంవత్సరాల నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వవిప్ లు, మంత్రులుగా శింగనమల నియోజకవర్గం నుండి ఎన్నియ్యారు. కానీ ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది అందని ద్రాక్షలాగే నిలిచిపోయింది. ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు కలిపి దాదాపు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ విద్యార్థులు 80% కలిగి ఉన్నారు. ఈ విద్యార్థులు ఉన్నత విద్యా అభ్యసించాలి అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదవవలసిన పరిస్థితి వస్తోంది. నియోజకవర్గంలో తల్లి, తండ్రులు అంతా కూడా కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తూ, మమ్మల్ని చదివించడానికి నానా అవస్థలు పడుతున్నారు అని పవన్ కళ్యాణ్ కి తెలియజేశారు. శింగనమల నియోజకవర్గంలో ఇంకా పలు సమస్యలపైన జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పర్యవేక్షణలో ముస్లిం మైనార్టీ దుళన్ పధకంపై అలాగే బెడ బుడగ జంగాల కులం ఎస్సీలుగా గుర్తించాలని మరియు యల్లనూరు మండలంలో స్మశాన స్థలాల కబ్జాల పై భూముల కబ్జాపై బాధితులతో పవన్ కళ్యాణ్ కి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీరాములు, రామయ్య, కుళ్ళాయమ్మ, తాహిర్, దివ్యశ్రీ, చౌడేశ్వరి, గంగమ్మ తదితరులు కలిసి వినతిపత్రాలు అందజేశారు.