చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ చేసిన సింగరాయకొండ జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు.. ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాల మేరకు.. సింగరాయకొండ ట్రంక్ రోడ్డు లోనీ జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. చలివేంద్రం ఏర్పాటు చేసి ఎనిమిది వారాలు పూర్తి చేసుకొని, వేసవికాలంలో దాహార్తి తీర్చడానికి ప్రతీ రోజు చల్లని మినరల్ వాటర్, మరియు ప్రతి ఆదివారం చల్లని మజ్జిగ ప్రయాణికులకు, బాటసారులకు, యాచకులకు మరియు ప్రజలకు జనసేన పార్టీ తరుపున అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, కాసుల శ్రీనివాస్, గుంటుపల్లి శ్రీనివాసులు, అనుమల శెట్టి కిరణ్ బాబు, సయ్యద్ చాన్ బాషా, సంకే నాగరాజు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా భాష, షేక్ సుల్తాన్ బాషా, షేక్ సుభాని జనసైనికులు పాల్గొన్నారు.