జిల్లా క్షేత్రస్థాయి ప్రభుత్వాలపై నిప్పులు చెరిగిన సింగరాయకొండ జనసేన మండలాధ్యక్షులు

  • స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి ఇచ్చే అర్జీల పరిష్కారం దిక్కేలేదు
  • గడప గడపకు మన ప్రభుత్వం, అంతా వైసిపి గడపగడప కోసమే
  • ప్రజా సమస్యలు పరిష్కారం గాలికి
  • అధికార పార్టీ ప్రచారానికి ప్రభుత్వం యంత్రాంగం,

కొడెపు, సింగరాయకొండ మండలం మూలగుంట పాడు గ్రామపంచాయతీలో డ్రైనేజీలు మరియు సాగర్ నీరు సృజల స్రవంతి పథకం ద్వారా నూతన కుళాయిలకు రావాల్సిన సాగర్ నీరు వీధి లైట్లు మౌలిక వసతుల పై అర్జీలు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా అభివృద్ధి శూన్యం. అలాగే సింగరాయకొండ మేజర్ గ్రామపంచాయతీలో గల కనమళ్ల రోడ్ లోని మురుకి నీరు, వీధిలైట్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, మౌళిక వసతులపై ఆధారాలతో సహా గ్రామపంచాయతీలో జనసేన పార్టీ నుండి అర్జీ ఇచ్చి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా నిర్లక్ష్య ధోరణిలో వైసీపీ ప్రభుత్వం మరియు గ్రామ పంచాయతీ అధికారులు. సింగరాయకొండ మండలంలో గల పలు పంచాయతీలో ప్రజా సమస్యలపై పంచాయతీ కార్యదర్శులకు జనసేన పార్టీ నుండి ఇచ్చిన అర్జీలలో గల ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సింగరాయకొండ మండలంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మూడు పడకలు చేసిన వైసీపీ ప్రభుత్వం. ఆసపత్రిలో ఉన్న డాక్టర్లు విధుల నిర్వహణలో లేకుండానే, ఉన్నట్లుగా హాజరు, అదే వరుసలో నర్సులు, విధుల్లో ఉండకుండా వ్యవహరించడం ఆధారాలతో సహా జనసేన పార్టీ నుండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా డీఎంహెచ్ఓ లకు అర్జీ రూపంలో ఇచ్చి, సుమారు రెండు నెలలు గడుసున్నా అధికార ప్రభుత్వానికి లోబడి అధికారులు చర్యలు తీసుకోవడంలో శూన్యం. సింగరాయకొండ మండలంలో గల పలు సమస్యలపై అన్నింటికీ స్పందన కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ కి అర్జీ రూపంలో తెలియజేసినప్పటికీ కూడా కలెక్టర్ చర్యలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ప్రజలు ఆవేదనను తెలియపరిచారు. కావున ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి ఇచ్చిన అర్జీల ను పరిష్కరించి ప్రజా అభివృద్ధికి తోడ్పడగలరని జనసేన పార్టీ నుండి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజు కుమార్, జరుగుమల్లీ మండల అధ్యక్షులు గుడా శశి భూషణ్, మరియు సింగరాయకొండ మండల జనసేన నాయకులు దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ భాషా, అనుములశెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, తగరం రాజు, షేక్ సుల్తాన్ భాష, సయ్యద్ సుభాని, నామా మహేష్, వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.