సింగరాయకొండ వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి: ఐనాబత్తిన రాజేష్

  • వైసీపీ ఉడత ఊపులకు జనసేన భయపడదు
  • జనసేన రాజేష్ కి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సింగరాయకొండ ఎస్.ఐ పాతిమా

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీ 14, 15వ సంవత్సర పంచాయతీ నిధులను సర్పంచ్ తాటిపర్తి వనజ సొంత అకౌంట్ కు బదిలీ చేసుకోవడం జరిగినది. ఈ విషయంపై స్పందించిన జనసేన నాqయకులు సుమారు 35 లక్షలు సర్పంచ్ సొంత అకౌంట్ కి బదిలీ చేసి అవినీతికి పాల్పడినటువంటి సర్పంచ్ వనజను విచారించి, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పరిశీలించి, జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేయవలెనని సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇవ్వటం జరిగినది. ఈ క్రమంలో సింగరాయకొండ మండలం జనసేన అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్ పై సింగరాయకొండ మండలం వైసిపి నాయకులు ఎస్ కే గౌస్, ఎస్ కే నౌషాద్ లు బెదిరింపు కాల్స్ చేసి, ఇంటి వద్దకు మరియు షాపు వద్దకు వెళ్లి చంపుతాము, నీ అంతు చూస్తాము అని రౌడీయుజంతో గుండాలాగా చెలరేగిపోయారు. గత రెండు రోజుల నుండి సింగరాయకొండ మండలం వైసిపి నాయకులు జనసేన రాజేష్ పై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు, బుధవారం సింగరాయకొండ ఎస్సై కి ఫిర్యాదు చేయడం జరిగింది. విచారించి జనసేన రాజేష్ కి న్యాయం చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చారు, రాజేష్ పై బెదిరింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభుషన్, పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, టంగుటూరు మండలం అధ్యక్షులు కందుకూరి రాంబాబు, కొండేపి మండలం అధ్యక్షులు విశ్వం, మర్రిపూడి మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, సంకే నాగరాజు, అనుమల శెట్టి కిరణ్ బాబు, గుట్టుపల్లి శ్రీనివాసులు, కేశవులు, సీలం సాయి, తగరం రాజు, ఎస్.కె మహబూబ్ బాషా, ఎస్టి వావిద్, వినయ్, నాగేశ్వరరావు, కొండయ్య, రామ్ కోటయ్య, సురేంద్ర, వెంకటేష్, మహేష్, సందీప్, ఐయినాబత్తిన రాధిక, పోలిశెట్టి మాధురి, ఉప్పుటూరి రజిని మొదలైన వారు పాల్గొన్నారు.