బొగ్గుతోపాటు థర్మల్, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ
సింగరేణి 131వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సీఎండీ శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ నిర్ధేశించుకున్న లక్ష్యాలు సాధిస్తున్న కార్మికులను అభినందించారు. దేశంలో బొగ్గుతోపాటు థర్మల్, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని చెప్పారు. సమిష్టి కృషితో సింగరేణికి మరో వందేండ్ల సుస్థిర భవిష్యత్ ఉంటుందన్నారు.
సింగరేణిలో శతాబ్ది వేడుకులు నిరాడంబరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ దక్కన్ కంపెనీగా ఉన్న సింగరేణి.. సింగరేణి కాలరీస్ ఆవిర్భవించి నేటితో వందేండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ దక్కన్ కంపెనీ 1889లో ఇల్లెందులో వద్ద తొలిసారిగా బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 1920లో సింగరేణి కాలరీస్‌గా అవతరించింది. సింగరేణి కాలరీస్‌లో నిజాం షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1945లో తొలి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కాలరీస్ ఆవిర్భవించింది.
సింగరేణిలో ప్రస్తుతం 45,131 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ రూ.27 వేల కోట్ల బొగ్గును విక్రయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.7 వేల కోట్ల పన్ను చెల్లిస్తున్నది. అయితే కరోనా నేపథ్యంలో బొగ్గు గనులున్న ఆరు జిల్లాల్లో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.