మనుసులు గెలిచిన సింగరేణి ముద్దుబిడ్డ.. విన్నెర్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ

చికెన్​.. మటన్​.. చికెన్​..మటన్​ అంటూ బిగ్​ బాస్​ హౌస్​లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల మనుసులు గెలిచాడు. ఈ సీజన్​లో సోహైల్‌ అందరికంటే ఎక్కువ ఎంటర్​ టైన్​ చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ గుర్తింపు లేకుండా హౌస్​లోకి వచ్చిన సోహైల్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్​ సెలబ్రెటీ అయ్యాడు. తన క్యారెక్టర్​తో లక్షలాది ఫ్యాన్స్​ తో పాటూ  విన్నెర్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ గెలిచాడు.

టాప్ 3 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు గోల్డెన్ సూట్ కేస్‌.. ఆఫర్ ఫ్రేమ్ లోకి వచ్చింది. సూట్ కేస్ లో ఉన్న 25 లక్షలతో ఎవరైనా సరే, టాప్ 3 నుంచి తప్పుకోవచ్చని నాగ్ ఆఫర్ ఇస్తే.. మరో మాట లేకుండా సోహైల్ దాన్ని అందుకుని బయటకు వచ్చేశాడు. దాంతో సోహైల్ టాప్ 3కే పరిమితం అయ్యాడు. అయినా సరే, 25 లక్షలు వచ్చినట్టైంది. 25 లక్షలు సోహైల్ ఆఫర్ రూపంలో అందుకున్నాడు.

కాగా, సోహైల్‌కి 25 లక్షలు వచ్చినా, చిరు-నాగ్ చెరో పది లక్షలు ప్రకటించారు. అందులో 10 లక్షలు.. అనాథ ఆశ్రమానికి వెళ్తాయి. మిగిలిన పది..లో సోహైల్‌, మెహబూబ్ పంచుకుంటారు. అంటే. సోహైల్ కి మొత్తంగా 45 లక్షలు గెలిచాడన్న మాట.

మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ నుంచి బిగ్​బాస్​లోకి ఎంటర్​ కావడమే కష్టం. చిన్న ఆర్టిస్టు నుంచి ఏకంగా హౌస్​లోకి వచ్చి ఫైనల్​ దాక చేరడం, చిరు, నాగ్​లతో కలిసి స్క్రీన్​ పంచుకోవడం అతడికి లైఫ్​ లాంగ్​ గుర్తుండి పోయే అనుభవం. ఫినాలేలో విన్నర్​ అనౌన్స్​ అయ్యే దాక షో అంతా సొహెల్ చుట్టే తిరిగింది. దీన్ని బట్టే అర్థమవుతుంది అతడు కనెక్ట్​ అయినట్టు ఎవరూ కాలేదని. ఇక మెగాస్టార్ చిరంజీవి సోహైల్‌కు ఎంత ప్రియారిటీ ఇచ్చాడో అందరం చూశాం. ఏకంగా తనకోసం ఇంటి దగ్గరి నుంచి బిర్యానీయే తీసుకొచ్చాడంటే ఎంతగా ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

సింగరేణి ముద్దుబిడ్డ, కథ, కర్ఖానా, కథ వేరే వుంటది లాంటి తన ఊతపదాలు ఇక్కడ ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సింగరేణి ముద్దుబిడ్డ అంటూ ఎప్పుడూ తన ఊరిపై మమకారాన్ని చాటాడు. హౌస్​ మేట్లకు స్నేహ హస్తాన్ని అందించాడు. జనాలను ఎంటర్​టైన్​ చేశాడు. స్టార్​ హీరోల అభిమానం చురగొన్నాడు. జీరోగా వెళ్లిన ఓ పట్టణ యువకుడు సెలబ్రిటీగా బయటకు వస్తున్నాడంటే అది గొప్ప విషయమే. బిగ్​ బాస్​ తెచ్చిన క్రేజ్​తో ఫ్యూచర్​ను పక్కా ప్లాన్​ చేసుకుని ముందుకు నడిస్తే సోహైల్ సింగరేణి నల్లనేలకు బంగారుబిడ్డ అవుతాడు.