సింగర్ సునీత నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే

టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో సునీత ఒకరు. ఈమె కేవలం సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సునీత మనస్పర్దల వలన తన భర్తతో విడిపోయి సోలోగా ఉంటుంది. కొన్ని రోజుల ముందు నుండి సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమేనని రుజువు చేస్తూ సింగర్‌ సునీత సోషల్‌ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరుపుకుంది. కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్ద వేడుక జరిగినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా “ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్‌ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిలలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని సునీత మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేశారు.

సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. విడాకుల తర్వాత రెండో పెళ్ళిపై పుకార్లు చాలానే వచ్చిన వాటిని సున్నితంగా తిరస్కరించింది. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్పింది. కాని ఏమైందో ఏమో చివరకు రామ్‌తో కలిసి ఈ నెల 27న ఏడడుగులు వేసేందుకు సిద్దమైంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత అశేష ప్రేక్షకాదరణ పొందారు.