సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ..

ప్రముఖ సింగర్ సునీత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనినితో సునీత ఏడడుగులు నడవబోతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చతార్థం కూడా జరిగిపోతోంది. రామ్-సునీతల వివాహం డిసెంబర్ 27న హైదరాబాద్‌లో జరగనుందని నిన్నమొన్నటి ప్రచారం జరిగినా.. జనవరిలో ఉంటుందని సునీత తెలిపారు.

త్వరలో ఒకటవుతున్న ఈ జంట కోసం ప్రముఖ స్టార్ హీరో నితిన్ ఈ ప్రి వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ మరియు రామ్ వీరపనేని సన్నిహితులు కావడం చేత ఈ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించిని ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో సునీత, రామ్ వీరపనేని ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది.

డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈ పార్టీకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సునీత బెస్ట్ ఫ్రెండ్ రేణు దేశాయ్ మరియు టాప్ యాంకర్ సుమ కూడా వచ్చి సందడి చేశారు. ఈ పార్టీ కొన్ని గంటల పాటు అద్భుతంగా జరిగిందని తెలుస్తుంది. అలాగే తన ప్రీ వెడ్డింగ్ పార్టీలో తానే పాటలు పాడి అలరించింది సునీత.