వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన శిరీష

ఎల్ బి నగర్: కామినేని హాస్పిటల్ లో వైద్య నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆదివారం జనసేన పార్టీ ఎల్బీనగర్ కోఆర్డినేటర్ శిరీష మరియు ఇతర జనసైనికులు వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి మనోధైర్యం చెప్పడమే కాక, చట్టరీత్యా న్యాయ పోరాటానికి సంబంధించిన పూర్తి బాధ్యతను తానే తీసుకుంటారని శిరీష చెప్పడం జరిగింది.