క్రియాశీల సభ్యత్వ క్విట్స్ అందుకున్న సీతానగరం మండల జనసేన

తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం రాజనగరం నియోజకవర్గంలో మంగళవారం జనసేన పార్టీ సీతానగరం మండలం క్రియాశీల సభ్యత్వ క్విట్స్ క్రియాశీల సభ్యులకు మంగళవారం అందజేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి కార్యకర్తకు 5 లక్షల ప్రమాద భీమా మరియు 50000 రూపాయలు ఆక్సిడెంట్ జరిగినపుడు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకూ కార్యకర్తల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మొదటిసారి సభ్యత్వ నమోదు చేసుకోని వారు మరల ఈ సంవత్సరం మార్చిలో నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ శంకర్ కరిచెర్ల, జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వర రావు జనసేన, శివాజి మట్ట, మాధవరపు వీరభద్రరావు, చిక్కాల నాగశ్రీను, మరియు పెద్దలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.