‘లూసిఫర్’ సోదరిగా శివగామి!

మెగాస్టార్ చిరంజీవి సరసన ‘అల్లు డా మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర సినిమాల్లో స్టెప్పులు వేసి, తన నటనతో అదరగొట్టిన రమ్యకృష్ణ..ఇప్పుడు ఆయన సరసన సోదరిగా నటించబోతుందనే వార్త హల్ చల్ చేస్తోంది. చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘లూసిఫర్’ (lucifer) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్​ నటి రమ్యకృష్ణ కనిపించనుందని టాక్​. ఇప్పటికే మూవీ యూనిట్ ఆమెతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ‘లూసిఫర్’  సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మలయాలంలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమెక్ చేస్తున్నారు. అందులో మోహన్ లాల్ హీరోగా కనిపించారు. అయితే..లూసిఫర్ మలయాళం వర్షన్ లో సోదరి పాత్ర కీలకంగా ఉంటుంది. మంజూ వారియర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఈ పాత్ర కొనసాగనుంది. తెలుగులో చిరంజీవి సరసన చెల్లెల్లిగా ఎవరిని నటించాలనే దానిపై దర్శకుడు తర్జనభర్జనలు పడుతున్నారట. చివరకు ఈ పాత్రకు రమ్యకృష్ణ అయితే..కరెక్టు అని భావిస్తున్నారని టాక్. లూసిఫర్ లో చిరంజీవి సరసన చెల్లెల్లిగా రమ్యకృష్ణ నటిస్తారా ? లేదా ? అనేది చూడాలి.