గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన ఆరవరోజు

నెల్లూరుఇ, మా మొదటి ఓటు జనసేనకే కుటుంబ సభ్యులను కూడా జనసేనకే ఓటు వేయమని చెప్తాం అంటూ మద్దతు పలికిన విద్యార్థినులతో #𝐌𝐲𝐅𝐢𝐫𝐬𝐭𝐕𝐨𝐭𝐞𝐅𝐨𝐫𝐉𝐚𝐧𝐚𝐒𝐞𝐧𝐚 ఆరవ రోజు నెల్లూరు సిటీలో జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన వారికి ఎవరైనా ఓటు హక్కు రాకపోతే వివరాలు అందిస్తే మేము నమోదు చేస్తామని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, రాష్ట్రంలో స్కీములతో మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, నాలుగు సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువతని మభ్యపెడుతున్న వైయస్సార్ కి చమర గీతం పాడాలి. చదువుకున్న యువత రాష్ట్రం దాటిపోతే తప్పక ఉపాధి అవకాశాలు లభించడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వందమందికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడటం లేదు. ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇక బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీ కుటుంబ సభ్యులకు మీ తోటి వారికి జనసేనకి ఓటు వేయమని తెలపండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైనా మీ అందరి మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, బన్నీ, వర, కేశవ మౌనీష్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.