అల్లు అర్జున్ కారవాన్ కు స్వల్ప ప్రమాదం

అల్లు అర్జున్‌ కార్‌వాన్‌ స్వల్ప ప్రమాదానికి గురైంది. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ మూవీ షూటింగ్‌ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా.. ఆయన కార్‌వాన్‌ ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢకొీట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్‌ కార్‌వాన్‌లో లేకపోవడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో మేకప్‌ టీమ్‌ ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.