శిధిలావస్థలో చిన్న మునగనగడ్డ ప్రాథమిక పాఠశాల

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల మండలం, చిన్న మునగనగడ్డ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్కూల్ బిల్లింగ్ శిధిలావస్థకు చేరుకుంది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉండడంతో తాటాకు పాకలో 28 మంది విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం జనసేన పార్టీ దృష్టికి రావడంతో అక్కడికి వెళ్లి స్కూల్ పరిస్థితి చూసి విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా దారుణమైన విషయమని విద్యార్థులు చదువుకోవడానికి తరగతి గది వెంటనే ఏర్పాటు చేయాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తక్షణమే ప్రభుత్వం అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అడ్డతీగల మండల కుప్పాల జయరాం, పొడుగు సాయి, కర్ర నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.