కాకినాడ జనసేన ఆధ్వర్యంలో సామాజిక న్యాయ చైతన్య యాత్ర

కాకినాడ సిటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు బ్యాంక్ పేట నందు కాకినాడ సిటి కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్ మరియు వీరమహిళ నాయకురాలు సావాడ పావనిల ఆధ్వర్యంలో సామాజిక న్యాయ చైతన్య యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం సత్య సామాజిక చైతన్యం కోసం అహరహరం శ్రమించిన గొప్ప నాయకుడు శ్రీ రాం మనోహర్ లోహియా జయంతి సందర్భంగా వారి సేవలని కొనియాడారు. కులాల మధ్య అంతరాలు తగ్గించడం మరియు మహిళా సాధికారతతోనే భారతదేశ పురోగతి అన్న ఆయన విధానం జనసేన పార్టీ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు. నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం అణగారిన కులాలను మరింత అణచివేసే ధోరణిలో పాలిస్తోందని ఈ విషయమై ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికే ఈ యాత్ర అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గౌతం, చీకట్ల వాసు, ఏసుబాబు, దొర, వీరమహిళలు హైమవతి, మాధవి, జమున, రాగిణి మరియు జనసైనికులు పాల్గొన్నారు.