సామాజిక న్యాయ యాత్ర కేవలం ఓట్ల కోసమే: శశిరేఖ

  • వైసీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి విలువలేదు..!
  • భూములు లేని దళితులకు భూ పంపిణీ పథకం ఏమైంది..?
  • ఎస్సీ లకి సంబంధించి విదేశీ విధ్య పథకం ఏమైంది..?

అనంతపురం: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో మరొక్కసారి రాష్ట్ర ప్రజలను మోసంచేయడానికి బస్సు యాత్ర పేరుతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లను ఓట్ల కోసం వాడుతున్నారు తప్ప ఉన్నతమైన పదవులు మాత్రం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి నిధులు లేని కార్పొరేషన్లను మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చారని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ మండిపడ్డారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేయడానికి కనీసం అర్హత కూడా లేదు ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఏమిచేయని వైసీపీ ప్రభుత్వం ధైర్యంగా ముందుకు రాలేక బస్సు యాత్ర పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. జగన్ రెడ్డి రోడ్లపైకి రావాలంటే పరధాలమధ్య వస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే లు గడప గడపకు అని ప్రజలమధ్య కోస్తే ఎక్కడికక్కడ ప్రజలు నిలదీశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి విలువలేదు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ ప్రాంత కుటుంబాలన్నీ ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. వర్షాలు సరిగా లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమని బాధపడతా ఉంటే వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రంలో షికారుకెళుతున్నట్లు వైసిపి నాయకులు యాత్రకు వెళుతున్నారు!. రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేయాలని ఆదుకోవాలని లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ తెలియజేయడం జరిగింది.