సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం రావిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మెహర్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు సీనియర్ సిటిజన్స్ల ఇంటికి వెళ్ళి కలుసుకుని వారియొక్క క్ష్యేమ సమాచారం తెలుసుకున్నారు. జనసేన పార్టీని ప్రజలకు సంక్ష్యేమం అందించేందుకు సుపరిపాలనతో ముందుకు తీసుకువెళ్ళేందుకు తమ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో సలహాలను సూచించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవరుని అందచేసారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్దలని గౌరవించడం కాదుకదా కనీసం పట్టించుకునే తీరికకూడా లేదనీ, ఈ ముఖ్యమంత్రి మనస్తత్వం ఓటు బ్యాంకు మీద ప్రేమ తప్ప భావితరాలను తీర్చిదిద్దే పెద్దల మీద ఉండదని విమర్శించారు. లోగడ మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని అనేవారనీ కానీ నేడు రాజే మొండివాడు అయితే ఎలాఉంటాదో ఈ వై.సి.పి ప్రభుత్వం వచ్చాకా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి నాగేశ్వరరావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.