సొహైల్ కు ‘చిరు’ వరాల జల్లు..

బిగ్ బాస్ సీజన్ 4విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. విజేతకు ట్రోఫీ అందించడానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. పేరుపేరున హౌజ్ లో చేసిన పనులు ప్రస్తావించారు. అమ్మాయిల దగ్గర్నుంచి మొదలుపెట్టి అందరినీ కవర్ చేసిన ఆయన సొహైల్ మేనరిజానికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నీ పర్మిషన్ ఇస్తే తర్వాతి సినిమాలో అది నేను వాడేస్తానన్నారు. దానికి అయ్యో మీరు అలా అనొద్దు సార్ అంటూ సొహైల్ మోకాళ్లపై కూర్చొండిపోయాడు.

ఆ తర్వాత సొహైల్.. నీకు మా ఇంట్లో వాళ్లు బాగా కనెక్ట్ అయిపోయారు. నీకోసం ఇంటి దగ్గర్నంచి బిర్యానీ తీసుకొచ్చా. నీకు చాలా ఇష్టమని స్వయంగా మా సురేఖనే చేసి పంపిందంటూ చెప్పారు. దానికి అయ్యో సార్ థ్యాంక్యూ అంటూ సొహైల్ అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత సొహైల్ అడిగిన కోరికకు డబుల్ బొనాంజా ఇచ్చారు చిరు.

సొహైల్ నేను ఫ్యూచర్ లో సినిమా తీస్తే ఆ ఈవెంట్ మీరు రావాలని చిరంజీవిని అడిగితే దగ్గరుండి తానే జరిపిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా నీ సినిమాలో నాకూ ఓ రోల్ ఇస్తావా అని అడిగేసరికి సొహైల్ ఉబ్బితబ్బిబ్యయ్యాడు. ఆ తర్వాత సీజన్ లో బిర్యానీ గురించి సొహైల్ పడిన ఆరాటాన్ని చూపించిన చిరు నీతో పాటు అందరి కోసం నా భార్య చేతులతో వండిన బిర్యానీ పట్టుకొచ్చాను. నీకు నా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయిపోయిందని చెప్పారు.